ఏ ఎక్సర్‌సైజ్ చేస్తే త్వరగా బరువు తగ్గుతారు
ఫిట్‌గా ఉండాలని అందరికీ ఉంటుంది. అందుకోసం ఏవేవో ఎక్సర్‌సైజెస్
చేస్తుంటారు. దీని వల్ల బరువు తగ్గాం.. ఫిట్‌గా ఉన్నామని భావిస్తారు. కానీ,
అసలు ఏ వర్కవుట్స్ చేస్తే ఎంత బరువు కేలరీలు ఖర్చు అయ్యాయి.. ఎంత బరువు
తగ్గామో అనే విషయం అందరికీ తెలియదు. అందుకే ఏ వర్కవుట్ చేయడం వల్ల ఎన్ని
కేలరీలు ఖర్చయ్యాయో తెలుసుకోండి..
జాగింగ్ చేస్తే:
చాలా మంది ఎక్కువగా జాగింగ్ చేస్తుంటారు. దీని వల్ల కేలరీలు ఖర్చు అవుతాయని
తెలుసు. బరువు తగ్గాలంటే కేలరీలు ఖర్చులు కావాలి. ఇలా కేలరీలు ఖర్చు
అయితేనే త్వరగా బరువు తగ్గుతారు. కాబట్టి కనీసం 30 నిమిషాల పాటు చేస్తే
ఉపయోగం ఉంటుంది. ఇలా చేయడం వల్ల 400 కేలరీలు ఖర్చవుతాయి. కాబట్టి త్వరగా
బరువు తగ్గాలనుకునేవారు రోజుకి అరగంట పాటు జాగింగ్ చేస్తే త్వరగా బరువు
తగ్గొచ్చని చెబుతున్నారు నిపుణులు.
స్విమ్మింగ్..
ఈత కూడా మంచి ఎక్సర్ సైజ్ అని చెప్పొచ్చు. దీని వల్ల శారీరక, మానసిక
సమస్యలు కూడా చాలా వరకూ దూరం అవుతాయి. బరువుని తగ్గించడంలో ఇది బాగా పని
చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు స్విమ్మింగ్ చేయడం వల్ల మంచి ఉపయోగం
ఉంటుంది. అయితే, రోజుకి కనీసం 30 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేయాలి. ఇలా
చేస్తే 180 నుంచి 266 కేలరీలు ఖర్చవుతాయి. దీంతో వేగంగా బరువు తగ్గుతారు.
కేవలం బరువు తగ్గడమే మాత్రమే కాదు.. స్విమ్మింగ్ చేస్తే బాడీ ఫిట్‌గా
ఉంటుంది.
సైక్లింగ్..
సైకిల్ తొక్కడం కూడా చాలా మంచి వర్కవుట్.. దీన్ని ఎంచుకోవడం వల్ల మనం
ప్రయాణం చేయొచ్చు. అదే సమయంలో బరువు కూడా తగ్గొచ్చు. కాబట్టి సైక్లింగ్
కూడా మంచి ఆప్షన్ అని చెబుతున్నారు. అరగంట పాటు సైక్లింగ్ చేయడం వల్ల ఏకంగా
466 క్యాలరీలు ఖర్చవుతాయి. కాబట్టి మీ వీలును బట్టి దీనిని కూడా
ఎంచుకోవచ్చు.
ఎరోబిక్స్...
సిటీ లైఫ్‌లో పని ఒత్తిడితో ప్రతి ఒక్కరూ సతమతమవుతారు. అలాంటి వారు ఈ
వర్కవుట్‌ని ఎంచుకోవచ్చు. దీని వల్ల డ్యాన్స్ చేసినట్లుగా ఉంటుంది. బరువు
కూడా తగ్గిపోతారు. డ్యాన్స్ అంటే ఇష్టమున్నవారు దీనిని ఎంచుకోవచ్చు. దీని
వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఎరోబిక్స్ చేయడం వల్ల 400
క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయి. కాబట్టి బరువు కూడా తగ్గుతారు.
జంగింగ్ రోప్స్, రాక్ క్లైంబింగ్స్ కూడా..
బరువుని తగ్గించడంలో జంపింగ్ రోల్స్, రాక్ క్లైంబింగ్ కూడా మంచి ఎఫెక్ట్‌ని
చూపిస్తుంది. వీటిని చేయడం వల్ల కేలరీలు ఈజీగా ఖర్చు అయి బరువు తగ్గుతారు.
అరగంట పాటు జంపింగ్ రోప్స్ చేయడం వల్ల 300 నుంచి 444 కేలరీలు ఖర్చు
అవుతాయని చెబుతున్నారు నిపుణులు కాబట్టి.. బరువు తగ్గాలనుకునేవారు వీటిని
కూడా ఎంచుకోవచ్చు.
0 కామెంట్లు