సాధారణ బరువు కంటే అధిక బరువు ఉండటమనేది ఆలోచించదగిన విషయం అది మన ఆరోగ్యాన్ని ఇబ్బంది అవకాశం లేకపోలేదు. అధిక బరువు కారణాలంటే చాల ఉన్నాయ్ అందులో కొన్ని శరీరాన్ని కష్టబెట్టకపోవడం, ఎక్కువగా తినడం,సరైన వ్యాయామాలు చేయకపోవడం ఇలా చెప్పుకుంటే పోతే ఆర్టికల్ కాదు ఒక బుక్ రాయాల్సి వస్తుంది.






అధిక బరువుని తగ్గించుకోడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.... చాల మందికి ఇది కుదరకపోవచ్చు అందుకే మనం ఇంట్లోనే ఒక మూలన కూర్చుని యోగ చేస్తే బరువు తగ్గే అవకాశం ఉంది...
అందులో నాకు తెలిసిన కొన్ని యోగాసనాల గురించి ఇక్కడ రాస్తున్నాను.

సేతు బంధాసనం

 

వీపును నేలకు ఆనించి పడుకోవాలి.  మరియు పాదాలు నేల మీద విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మోకాళ్ళను వంచాలి. పాదాలు మరియు పిరుదుల మధ్య దూరం చేతులకు సమాంతరంగా ఉండేట్లుగా నిర్ధారించుకోండి మరియు ఇపుడు శరీరాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. ఈ విధంగా 5 నుండి10 సార్లు సాధన చేయడానికి ప్రయత్నించండి & తరువాత యధాస్థానానికి వచ్చేయండి.

శల్బాసనం

 

నుదురు మరియు గదవ భాగాలు నేలపై మరియు చేతులు తొడల క్రింద విశ్రాంతి తీసుకుంటునట్లుగా ఉంచి కడుపు పై పడుకొని ఆసనాన్ని ప్రారంభించండి. తర్వాత, ఎడమ కాలును నేరుగా ఉంచి, 10 అంగుళాలు వరకు పైకి ఎత్తడానికి ప్రయత్నించండి, కానీ మోకాలు వంగకుండా ఉందో నిర్ధారించుకోండి. ఆ తరువాత, కుడి కాలును కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నించండి మరియు చివరగా, ఇదే విధంగా రెండు కాళ్లతో చేయండి.

చక్కి చలనాసనం

 

ఇది కడుపులోని కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడే ఒక శక్తివంతమైన వ్యాయామం. దీని కోసం, మీరు సౌకర్యవంతమైన స్థానంలో కూర్చోవాలి & మీ రెండు కాళ్లు ఒకదానితో ఒకటి ఆనించుకుంటూ మీ ముందుకు నేరుగా చాపాలి. అయితే, మోకాళ్ళు వంచి లేవు అని నిర్ధారించుకోండి. తరువాత రెండు చేతులను ఒకదానితో ఒకటి జోడించుకోవాలి & కాళ్ళ మీద నుండి వృత్తాకారంగా కదుపుతూ త్రిప్పాలి.ఈ విధమైన చలనాలను సవ్య దిశలో 10 సార్లు & అప సవ్య దిశలో 10 సార్లు త్రిప్పాలి మరియు ఆ తర్వాత ఆసనం నుండి నెమ్మదిగా విడుదల కావాలి.

నౌకచలనాసనం

 

నేరుగా సౌకర్యవంతమైన స్థానంలో కూర్చోవాలి మరియు కాళ్లని ఒకదానితో ఒకదాన్ని ఆనించి నేరుగా మీ ముందుకు చాపండి. మళ్లీ, మోకాళ్ళను వంచకుండా మరియు చేతులను శరీరంకు ఇరువైపులా ఉంచండి. ఇప్పుడు చేతులను ముందుకు & వెనుకకు కదపడానికి ప్రయత్నించండి. అలాగే, చేతులు కదులుతున్న పద్ధతిలోనే శరీరం కూడా కదపాలి. ఒక పడవను నడుపుతున్న విధంగా కదలాలి. ఈ విధంగా సవ్య దిశలో 10 సార్లు మరియు అపసవ్య దిశలో 10 సార్లు పునరావృతం చేయాలి మరియు ఆ తర్వాత ఆసనం నుండి నెమ్మదిగా విడుదల కావాలి.

ధనురాసనం

 

సాధారణంగా దీనిని బో పోజ్ అని పిలుస్తారు. ఇందులో మీరు చేయాల్సిందల్లా నేల పై కడుపును ఆనించి పడుకోవాలి మరియు ఛాతికి ఇరువైపులా చేతులను ఉంచాలి. ఆ తర్వాత, ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి మరియు కాళ్లను & తొడలను పైకి ఎత్తాలి. అదే సమయంలో, చేతులతో కాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇదే భంగిమలో కనీసం 30 సెకన్ల పాటు నిలిచి ఉండడం మంచిది & ఆ తర్వాత ఆసనం నుండి నెమ్మదిగా విడుదల కావాలి.