వేసవికాలంలో కళ్ళను సంరక్షించుకునే చిట్కాలు

 వేసవికాలంలో ఆరోగ్య సమస్యలు అధికంగానే కలుగుతుంటాయి. వీటిలో కంటి సమస్యలు కూడా ఒకటని చెప్పవచ్చు. వేసవిలో కళ్ళను సంరక్షించుకోటానికి కొన్ని చిట్కాలు తెలుపబడ్డాయి.

సన్ గ్లాస్ ల వాడకం

young Woman With Big Sunglasses And Hat

వేసవికాలంలో, సన్ గ్లాస్ ల వాడకం తప్పని సరి. వీటిలో, సన్ గ్లాస్ ల అంచులు పెద్దవిగా ఉండి, పూర్తి కంటిని కపాడేవిగా ఉండేలా చూసుకోండి. వేసవిలో సూర్యుడి నుండి వెలువడే ప్రమాదకర UV (అతినీలలోహ) కిరణాలు మరియు వీచే వేడి గాలి నుండి కళ్ళను కపడే విధంగా ఉండాలి.

సూర్యకిరణాలకు బహిర్గతం అవకండి

https://live.staticflickr.com/3931/15343455567_f6aa4ccf38_b.jpg

సూర్యుడి నుండి వెలువడే ప్రమాదకర అతినీలలోహిత కిరణాలకు బహిర్గతం అవటం వలన వివిధ రకాల అనారోగ్యాలు మాత్రమే కాకుండా, "కంటిశుక్లాలు" కలిగే అవకాశం ఉంది. కావున మీ కళ్ళను కప్పి ఉండే వస్తువులను వాడండి. భయటకి వెళ్ళినపుడు పెద్దవిగా ఉండే క్యాప్ లను ధరించండి. క్యాప్ లతో పాటూగా సన్ గ్లాస్ లు కూడా తప్పకుండా అవసరం.

జాగ్రత్తగా సన్ బ్లాక్ లను వాడండి

 

వేసవి కాలంలో వాడే సన్ బ్లాక్ లు చర్మానికి ఆరోగ్యకరమే, కానీ వీటిని కంటి చర్మం చుట్టూ అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, వీటిని చర్మానికి, కంటి చుట్టూ అప్లై చేసే సమయంలో కంట్లో చేరి, చికాకులను కలిగించే అవకాశం ఉంది. కావున వీటి వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు తప్పని సరి అని చెప్పవచ్చు. 

ఆరోగ్యకరమైనవి తినండి

కొన్ని రకాల ఆహర పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని, మెరుగుపరుస్తాయి ముఖ్యంగా, వేసవి కాలంలో కళ్ళను సంరక్షిస్తాయి. మీరు తినే ఆహారంలో పోషకాలను మరియు మినరల్ లు ఉండేలా చూసుకోండి, ముఖ్యంగా 'ల్యూటిన్' మరియు 'క్సాన్తిన్' లతో పాటుగా విటమిన్ 'C', 'E' మారియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లు ఉండేలా చూసుకోండి.

ఆరోగ్యకరమైనవి తినండి

కొన్ని రకాల ఆహర పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని, మెరుగుపరుస్తాయి ముఖ్యంగా, వేసవి కాలంలో కళ్ళను సంరక్షిస్తాయి. మీరు తినే ఆహారంలో పోషకాలను మరియు మినరల్ లు ఉండేలా చూసుకోండి, ముఖ్యంగా 'ల్యూటిన్' మరియు 'క్సాన్తిన్' లతో పాటుగా విటమిన్ 'C', 'E' మారియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లు ఉండేలా చూసుకోండి.

రోజు వ్యాయామాలు

వ్యాయామాలు, శరీరానికి మరియు మనసుకు తక్షణ ప్రయోజనాలను కలుగచేస్తాయి. ఎవరైతే చైతన్యంగా ఉండే జీవనశైలిని అనుసరించే వారిలో 70 శాతం వరకు "మాస్కులర్ డీజెనరేషన్" గురవరని "బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తల్మాలజీ" వారు తెలిపారు. వ్యాయామాల వలన కళ్ళకు మాత్రమేకాకుండా, పూర్తి శరీరానికి ప్రయోజనాలున్నాయి.

కంటి పరీక్ష

మీ కంటి చూపులో ఎలాంటి సమస్యలు లేకపోయినను, క్రమంగా వైద్యుడిని కలిసి కంటి పరీక్ష చేపించటం మంచిది. నిజానికి, మన శరీరం యొక్క పూర్తి ఆరోగ్యం గురించి కళ్ళ ద్వారా తెలుస్తుంది కావున, ఎప్పటికపుడు కంటి పరీక్షలను నిర్వహించటం మీకే మంచిది.

పొగతాగటం మానేయండి

పొగ తాగటం వలన మన గుండె మరియు ఊపిరితిత్తులలో ఏమ్ జరుగుతుందో మన అందరికి తెలిసిందే. అంతేకాకుండా, పొగతాగటం వలన మన కంటి చూపు కూడా పాడవుతుంది. క్రమంగా పొగ తాగటం వలన "మాస్కులర్ డీజెనరేషన్" మరియు "కంటిశుక్లాలు" వంటి కంటి సంబంధిత వ్యాధులు కలుగుతాయి. కావున వేసవిలో పొగ తాగటానికి దూరంగా ఉండండి.