సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నించేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు

 90 శాతం మహిళలు మంచి బాడీ ఉన్న యువకులను ఇష్టపడతారు అనేది అందరికి తెలిసిన విషయం (jsut kidding).సాధారణంగా 20 సంవంత్సరాలు దాటినా యువకులకు వారి శరీరం మీద ఇష్టం పెంచుకుంటుంటారు అందులో సిక్స్ ప్యాక్ గురించి చెప్పనక్కర్లేదు. 
గాయాలు కాకుండా మరియు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకొని సిక్స్ ప్యాక్ బాడీ పొందాలంటే కొన్ని విషయాల గురించి తప్పక అవగాహన ఉండాలి. మీరు సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి.
ముఖ్యంగా సిక్స్ ప్యాక్ బాడీ ఈ కాలంలో చాలా ప్రాముఖ్యం పొందినది. అవునా! ఈ రకంగా మన శరీర ఆకృతి మారాలంటే నడుము చుట్టూ ఉండే కొవ్వు మాత్రమే కాకుండా, శరీరంలో ఉండే మొత్తం కొవ్వు కరిగించాలి. ఇలా సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నించే క్రమంలో గాయాలకు దూరంగా ఉండాలంటే కింద తెలిపిన సూచనలు పాటించాలి.
వ్యాయామం చేసేటప్పుడు కీళ్లనొప్పులా? అయితే ఇలా చేయండి

క్రంచెస్ చేయండి

 

మీ ఉదర భాగం పటిష్టంగా మారాలంటే క్రంచెస్ మంచి వ్యాయమంగా చెప్పవచ్చు, ఒకవేళ మీరు 3 సెట్లు చేయాలి అనుకుంటే 20 సార్లు చేయండి, 4 సెట్లు చేయలకుంటే 15 సార్లు వీటిని అనుసరించండి.

తీవ్రమైన వ్యాయమాలను చేయకండి

మీరు క్రంచెస్ ను ప్రతిరోజు చేస్తున్నారా? అయితే పైన వేలాడుతూ కాళ్ళను లేపటం (హంగింగ్ లెగ్ రిసెస్) మరియు వైండ్మైల్స్ వ్యాయామాలను ప్రతిరోజు చేయకండి. ఇవి ఉదర భాగంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి కావున తగిన విరామాల తరువాత అనుసరించండి.

శక్తి ఉత్పన్న & కార్డియో వ్యాయామాలను జోడించండి

 

సిక్స్ ప్యాక్ ఆబ్స్ ఆవిష్కరించటానికి శక్తి పునరుద్దరణ వ్యాయామాలు మరియు తీవ్రమైన కార్డియో వ్యాయామాలను చేయండి. వారంలో ఒకసారి ఉదర భాగానికి చేసే వ్యాయామాలతో, శక్తిని పంచే వ్యాయామాలను జోడించి చేయటం మంచిది.

సరైన ఆహారాన్ని తినటం మరవకండి

 

ఎలాంటి ఫిట్నెస్ నియమావళికైనా పోషకాల సహాయం తప్పని సరి. కావున తక్కువ కెలోరీలను, తక్కువ కార్బోహైడ్రేట్లు తక్కువ కొవ్వు పదార్థాలు మరియు అధిక ప్రోటీన్ లు గల ఆహార పదార్థాలను పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకొండి. సోడా మరియు సంవిధాన పరచిన ఆహార పదార్థాలకు వీలనంత దూరంగా ఉండండి.