కండరాల నెప్పులకి 5 సమర్ధవంతమైన హోం రెమెడీస్



 ఎప్పుడైనా మీకు వ్యాయామం తరువాత కాలిలో తీవ్రమైన నెప్పి లేదా లోపల నుండి బాగా లాగేస్తున్నట్లు అనిపించిందా?? లేదా పొద్దున్న నిద్ర లేవగానే తాజా గా ఉండటానికి బదులు తీవ్రమైన మెడ నెప్పి వల్ల బాగా బలహీనం గా అనిపిస్తోందా??అయితే కనుక పైన చెప్పిన రెండు సందర్భాలలో మీ కండరాల వల్లే మీకు ఆ బాధ.ఎక్కువ గా కండరాలు అలసిపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుంది.కండరాల నెప్పి చాలా సాధారణం. మనందరం జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు దీని బారిన పడతాము.
మన శరీరం మీద కండరాలు కవచం లా ఉండటం వల్ల శరీరం లో ఏ భాగం లోనైన కండరం నెప్పి రావచ్చు.ఈ నెప్పి కి అనంత కోటి కారణాలు.కొన్ని మందులు, లేదా ఫిబ్రోమ్యాల్జియా (కొన్ని కండరాలని అతిగా వాడటం) లేదా కండరాల మీద ఒత్తిడి వల్ల ఈ నెప్పి రావచ్చు.
ప్రతీ చిన్న లేదా కాస్త ఎక్కువ కండరాల నెప్పులకి వైద్యుడిని సంప్రదించడం అసౌకర్యం అని నా వ్యక్తిగత అభిప్రాయం.చిన్న చిన్న బెణుకులని సులువుగా హోం రెమెడీస్ తో నయం చేయవచ్చు.కింద ఇచ్చిన చిట్కాలు చూసి ఏదైనా ఒకటి పాటించి అలసిన మీ కండరాలకి ఉపశమనం ఇవ్వండి.

1.కాస్త విరామం తీసుకోండి: 

మీరు కనుక కాళ్ళు, చేతులు లేదా కండారల కదలికలు ఎక్కువ గా ఉండే వ్యాయామం లాంటిదేమైనా చేస్తుంటే మీ కండరాలు సలపడం సాధారణమే.అందువల్ల వాటి మీద కాస్త ఒత్తిడి తగ్గించడానికి కూర్చుని కాసేపు రిలాక్స్ అవ్వండి.మంచం మీద హాయిగా దుప్పటీ కప్పుకుని ఓ రెండు గంటలు పడుకోరాదూ??

2.మినరల్ స్నానం

Image result for bathing

ఎప్సం సాల్ట్ మెగ్నీషియుం మరియు సల్ఫర్ కలిగిన మినరల్.ఒట్టు, మా మాట నమ్మండి, ఎప్సం సాల్ట్ మీ కండరాల సలుపులని పోగొడుతుంది.మీ బాత్ టబ్ నిండా గోరు వెచ్చటి నీరు పోసి ఈ మ్యాజిక్ మినరల్ ఓ రెండు కప్పులు కలపండి. ఎప్సం సాల్ట్ నీటిలో కలిసేటట్లు చేతితో నీటిని తిప్పండి.ఓ అరగంట అందులో కూర్చుని చూడండి.. ఆశ్చర్య కరం గా ఎటువంటి ఔషధ చికిత్సా లేకుండానే చాలా హాయిగా అనిపిస్తుంది.

3.ఐస్ ప్యాక్: 

సలుపుతున్న కండరాల ఉపశమనానికి ఐస్ ప్యాక్ చికిత్స ఒక అధ్భుత విధానం.నెప్పి ఉన్న చోట ఐదు లేదా పది నిమిషాలపాటు ఐస్ ప్యాక్ ని పెట్టి తీసేసి మరలా ఓ ఐదు పది నిమిషాల తరువాత మరలా నెప్పి ఉన్న చోట పెట్టాలి.ఐస్ ప్యాక్ నెప్పి మరియు వాపు ని వెంటనే తగ్గిస్తుంది.

4.కండరాలని సాగదీయడం లేదా స్ట్రెచ్ చేయడం:

 

 కండరాలు నెప్పిగా ఉంటే చిన్న చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు ప్రయత్నించండి. మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల కండరాలలో కదలిక ఏర్పడి అవి నెప్పితో మరింత బిగుసుకుపోవు.ఈ పద్ధతి కనడరాల నెప్పులని ఖచ్చితం గా నివారిస్తుంది.

5.స్విమ్మింగ్: 

కండరాల నెప్పి నుండి మీ ఆలోచనలని మళ్ళించడానికి స్విమ్మింగ్ ఒక సరదా యాక్టివిటీ. ఈతకొట్టడం వల్ల మీ కండరాలు సాగదీయబడి అదురుతున్న కండరాలని సైతం శాంతింపచేస్తుంది.మరింక ఆలశ్యమెందుకు?? వెంటనే ఒక స్విం సూట్ వేసుకుని ఈత కొలనులో మునగండి.కానీ ఒకవేళ మీరు కనుక "ఫైబ్రోమాల్జియా"(ఒక రకమైన కండరాల నెప్పి) తో బాధపడుతున్నట్లయితే కనుక జాగ్రత్త. చల్లని నీరు మీ నెప్పులని మరింత హెచ్చించవచ్చు .