వ్యాయామాలు మనలో అద్భుతాలను సృష్టిస్తాయని మహాత్మాగాంధీ నమ్మేవారు. అవును నిజమే, వ్యాయామాల వలన శరీర పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ భావన గతంలో కన్నా నేడు చాలా సంబంధితంగా ఉంది. మనలో చాలా మంది ఆఫీసులలో గంటల సమయం కూర్చోని పని చేస్తూ, ఇంటికి వెళ్ళగానే మంచి రుచికర ఆహారాలతో భోజనం చేసి, విశ్రాంతి వైపు మొగ్గు చూపుతుంటాము. భౌతిక కార్యాలను అనుసరించటం కాదు, వాటి మాటే మనం మర్చిపోయాము. శారీరాక వ్యాయామాల తగ్గుదల వలన ప్రపంచంలో వ్యాధుల స్థాయిలు గణనీయంగా పెరిగిపోయాయి. వ్యాయామాల వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే, కనీసం కొంత మందిలో చైతన్యం కలిగి అనుసరించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు వ్యాధుల సంక్రమణ లేని ప్రపంచాన్ని చూడాలన్నదే మా ఆకాంక్ష. వ్యాయామాల వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ పేర్కొనబడింది.

గర్భిణిగా ఉన్నప్పుడు వ్యాయామాలు చేయొచ్చ?  
benefits of doing exercises in telugu
reverse crunches


ఫిట్ గా ఉంచటంలో

ప్రపంచవ్యాప్తంగా, ఊబకాయం మరియు ఊబకాయ సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయి. మన ఆహారపు అలవాట్లు రోజు రోజుకు దిగజారుతున్నాయి (అందుబాటులో ఉండే లేదా సమయానికి అనుగుణంగా), మరియు ఈ జీవనశైలి అనుసరించటం వలన కలిగే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఉన్న ఏకైక మార్గం- వ్యాయామాలు.

జీవనశైలి వ్యాధులు

రోజు వ్యాయామాలను అనుసరించటం వలన హృదయం ఆరోగ్యంగా ఉండటమేకాకుండా, అల్జైమర్స్ మరియు ఒస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) వంటి వృద్దాప్య సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వాకింగ్ వంటి శారీరక వ్యాయామాల ద్వారా మధుమేహం మరియు ఇతరేతర దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

హార్మోన్ల ఆరోగ్యం

మహిళలు రోజు వ్యాయామాలు చేయటం వలన మెనుస్ట్రువల్ సిండ్రోం మరియు రుతుక్రమ సమయంలో కలిగే తిమ్మిరులను తగ్గించటమే కాకుండా, భవిష్యత్తులో వీటి తీవ్రతలను తగ్గించటానికి కూడా సహాయపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే స్త్రీలతో పోలిస్తే, వ్యాయామాలను చేయని స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ కు గురయ్యే అవకాశాలు చాలా అధికం అని అధ్యయనాలలో వెల్లడించబడింది.

మానసిక విశ్రాంతి

శారీరక వ్యాయామాల వలన అనేక రకాల ప్రయోజనాలు మాత్రమేకాకుండా, మరోపక్క మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కుడా చాలానే ఉన్నాయి. సాంప్రదాయబద్దమైన వ్యాయామాలు- యోగా- వంటి వ్యాయామాలు, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచటమే కాకుండా, మానసిక బలాన్ని కూడా చేకూరుస్తాయి. వ్యాయామాలను అనుసరించటం వలన, డిప్రెషన్ మరియు అనేక రకాల రుగ్మతల నుండి ఉపశమనం పొందవచ్చు. వ్యాయామాల వలన శారీరకంగా ఫిట్ గా ఉంచి , శరీరాన్ని ఆదీనంలో ఉంచటమే కాకుండా, వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుతాయి.
Image Courtesy: Getty Images